యూనిఫైడ్ పెన్షన్ విధానం (యూపీఎస్) సాధించడంతో గుంటుపల్లి రైల్వే వ్యాగన్ వర్క్ షాపు వద్ద సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. గత 20 సంవత్సరాల నుంచి ఏఐఆర్ఎఫ్, ఎస్సీఆర్ఎంయూ అలుపెరుగని పోరాటాల ద్వారా యూపీఎస్ ను సాధించుకోగలిగినట్లు సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ గుంటుపల్లి బ్రాంచ్ కార్యదర్శి ఎంవిఎం నాగేశ్వరరావు తెలిపారు.