రక్తం చిందిస్తూ ఇమామ్ హుస్సేన్‌కు నివాళి
NEWS Aug 26,2024 04:04 pm
హజరత్ ఇమామ్ హుస్సేన్, అతని పరివారానికి ముస్లింలు సోమవారం రక్తం చిందిస్తూ నివాళులర్పించారు. హుస్సేన్ అర్భయీన్‌లో భాగంగా మామిడికుదురు మండలం బడే బీబీ పంజాలో మజిలీస్ జరిగింది. గుర్రంపై పీరుని ఊరేగిస్తూ గుండెలు బాదుకుంటూ మాతం నిర్వహించారు. హుస్సేన్... హుస్సేన్.. అంటూ పలువురు బ్లేడులతో శరీరాలను గాయపర్చుకొని రక్తం చిందించారు. భారీ సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు.