కాకినాడ యాంకరేజ్ పోర్టును పరిశీలించిన జేసీ
NEWS Aug 28,2024 02:53 am
కాకినాడ యాంకరేజ్ పోర్ట్‌ను సోమవారం జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, ట్రైనీ కలెక్టర్ హెచ్ ఎస్ భావన పౌరసరఫరాల అధికారులతో కలిసి పరిశీలించారు. పోర్ట్‌లో అక్రమ బియ్యం ఎగుమతులను అరికట్టే చర్యల్లో భాగంగా ఇటీవల ఏర్పాటు చేసిన రెండు చెక్ పోస్ట్‌లను ఆయన తనిఖీ చేశారు. చెక్ పోస్ట్‌ల వద్ద విధులు నిర్వహిస్తున్న సిబ్బంది ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించాకే లోనికి అనుమతించాలని ఆదేశించారు.