29న బంగాళాఖాతంలో అల్పపీడనం
NEWS Aug 26,2024 11:30 am
ఉత్తర మధ్య బంగాళాఖాతంలో ఈ నెల 29న ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిషాని ఆనుకొని అల్పపీడనం ఏర్పడనుందని వివిధ వెదర్ మోడల్స్ చెబుతున్నాయి. దీని ప్రభావంతో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఈ నెల 29,30,31, సెప్టెంబర్ 1 వరకూ భారీస్థాయిలో వర్షాలు నమోదు అయ్యే అవకాశం ఉంది. లోతట్టు ప్రాంతప్రజలు, నాగావళి, వంశధార నదీ తీర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వెదర్ మోడల్స్ ఛాయా చిత్రాలు తెలుపుతున్నాయి.