సమాజ సేవకురాలు మదర్ థెరిసా ఆదర్శనీయురాలు, చిరస్మరణీయురాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అన్నారు. స్థానిక 46వ డివిజన్‌లో మదర్ థెరిసా యూత్ అండ్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో ఆనందనగర్‌లోని మదర్ థెరిసా విగ్రహం వద్ద జయంతి వేడుకలు జరిగాయి. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మదర్ థెరిసా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.