కొత్తపేట మండలం వానపల్లిలో 1వ వార్డులో నంబర్ 13వ అంగన్వాడీ భవనం శిథిలావస్థకు చేరింది. దీంతో కేంద్రాన్ని వేరే చోటకు మార్చారు. సరైన భవనం లేక అంగన్వాడి కేంద్రానికి వెళ్లే విద్యార్థులు, టీచర్లు ఇబ్బందులు పడుతున్నారు. కొత్త అంగన్వాడీ భవనం నిర్మించాలని, అలాగే గ్రామంలో అసంపూర్తిగా ఉన్న డ్రైనేజీ నిర్మించాలని, ప్రధాన కాలువకు రేవులను నిర్మించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.