తీన్మార్ మల్లన్నవార్నింగ్
NEWS Aug 26,2024 10:45 am
సొంత నేతలపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను ఓడించేందుకు రెడ్డి నేతలు కుట్రలు చేశారని ఆరోపించారు మల్లన్న. కౌంటింగ్ రోజు విదేశాల నుంచి ఓ మంత్రి ఫోన్ చేసి మల్లన్న ఓడిపోయే అవకాశం ఉందా, లేదా అని ఆరా తీశారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ నాయకులకు తప్పకుండా వచ్చే ఎన్నికల్లో ఓడించి బుద్ధి చెప్తానని, వడ్డీతో సహా చెల్లిస్తానని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు మల్లన్న. అయితే,.. ఈ వ్యాఖ్యలు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని ఉద్దేశించి చేసినవేనని టాక్.