కాకినాడ జిల్లా వెంకటకృష్ణరాయపురంలో శ్రీ కృష్ణాష్టమి వేడుకలను పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ప్రారంభించారు. కృష్ణాష్టమి వేడుకలు అందరికీ శుభాలను చేకూర్చాలని ఎమ్మెల్యే చినరాజప్ప ఆశాభావం వ్యక్తం చేశారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అన్నదానాన్ని ఎమ్మెల్యే చినరాజ ప్రారంభించారు. సుమారు 3000 మందికి కృష్ణాష్టమి అన్న ప్రసాద వితరణ చేశారు.