అమలాపురం పట్టణ దేవత సుబ్బాలమ్మ అమ్మవారికి వెండి చీర నిర్మాణం కోసం భక్తులు వెండి సమర్పిస్తున్నారు. అమలాపురం చెందిన దేశం శెట్టి సాయిబాబు శాంతి కుమారి దంపతులు 21 గ్రాముల వెండి సుబ్బాలమ్మ ఆలయంలో ఆలయ అభివృద్ధి కమిటీకి సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో వై మూర్తి, పి పుల్లయ్య నాయుడు, గంగాధర్ తదితరులు అమ్మవారికి వెండి సమర్పించిన సాయిబాబా దంపతులను అభినందించారు.