మామిడికుదురు మండలం మొగలికుదురులో ఆర్అండ్ బీ రోడ్డు పక్కన విద్యుత్ స్తంభాలు ప్రమాదకరంగా మారాయి. ఆర్అండ్ బీ అధికారులు రహదారిని అభివృద్ధి చేసి ఏళ్ళు గడుస్తున్నా విద్యుత్ స్తంభాలను మాత్రం తొలగించలేదు. స్తంభాలను మార్పు చేసేందుకు అవసరమైన నిధులను ఆర్అండ్ బీ చెల్లించలేదని ఎలక్ట్రికల్ అధికారులు చెబుతున్నారు. రెండు శాఖల మధ్య సమన్వయ లోపం ప్రజలకు ఇబ్బందిగా మారింది. స్తంభాలు మార్పు చేయాలని డిమాండ్ చేశారు.