బీజేపీపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతోంది: పురందీశ్వరి
NEWS Aug 26,2024 10:45 am
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ పాలనపై ప్రజల్లో రోజురోజుకు విశ్వాసం పెరుగుతుందని రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుపాటి పురందీశ్వరి అన్నారు. ఈ మేరకు రాజమహేంద్రవరంలో నిర్వహించిన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యశాల కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. బీజేపీ అభిమానులు అందరూ సభ్యత్వ నమోదు తప్పనిసరిగా చేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు, అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.