27న బంద్ అంటూ తప్పుడు ప్రచారం
NEWS Aug 26,2024 04:03 pm
పాడేరు ఐటీడీఏ పరిధిలో 27న బంద్ అంటూ తప్పుడు ప్రచారం సామాజిక మధ్యమంలో హల్చల్ చేస్తోంది. దీనిపై సీఐ నవీన్ కుమార్ను వివరణ కోరగా.. తమకు ఎటువంటి సమాచారం లేదని, ఫోన్ నంబర్లు లేకుండా తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. విద్యార్థి నాయకుల్ని ప్రశ్నించగా ఇది తెలంగాణ ప్రాంతానికి చెందినదిగా చెబుతున్నారు. ఈనెల 27న ఏజెన్సీలో ఎటువంటి బంద్ లేదని పోలీసులు చెబుతున్నారు.