సెప్టెంబర్ 2 నుంచి క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్ర
NEWS Aug 27,2024 09:24 am
సెప్టెంబర్ 2 నుంచి క్లీన్ ఆంధ్ర- గ్రీన్ ఆంధ్రకు నియోజకవర్గంలో శ్రీకారం చుట్టనున్నట్లు జనసేన పార్టీ జగ్గంపేట నియోజకవర్గ ఇన్‌ఛార్జి తుమ్మలపల్లి రమేష్ తెలిపారు. అధినేత పవన్ పుట్టినరోజును పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లుచెప్పారు. వేప, ఉసిరి, చింత, రావి, నేరేడు మొక్కలను నాటుకోవాలని జన సైనికులకు ఆయన సూచించారు.