కాకినాడ రూరల్ పరిధి మధురానగర్ గోకులంలో కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ ధర్మకర్త మురళి తెలిపారు. గోకులాన్ని ఏర్పాటు చేసి 16 సంవత్సరాలు అయినట్లు పేర్కొన్నారు. సోమవారం ఉదయం పూజా కార్యక్రమాలు నిర్వహించగా సాయంత్రం ప్రత్యేక ఆధ్యాత్మిక సాంస్కృతిక వేడుకలు నిర్వహిస్తామని, కృష్ణాష్టమి వేళ స్వామిని దర్శించి ఆశీస్సులు పొందవచ్చునని మురళి వివరించారు.