TG స్థానిక సంస్థల ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో కొత్త ఓటర్ల నమోదుకు శ్రీకారం చుట్టింది. ఓటరు జాబితా సవరణ ప్రకారం 18 ఏళ్లు నిండే యువతకు ఓటు హక్కు కల్పించడంతోపాటు మార్పులు, చేర్పులు చేపట్టనున్నారు. ఈ నెల 20 నుంచే జిల్లాలో ఓటరు జాబితా సవరణ ప్రక్రియ మొదలై చురుగ్గా సాగుతున్నది. ఆగస్టు 20 నుంచి అక్టోబర్ 18 వరకు ఓటరు జాబితా సవరణలో భాగంగా బీఎల్‌వో ఇంటింటికీ తిరిగి పేర్లను పరిశీలిస్తారు. అక్టోబర్ 28 కల్లా పూర్తి చేస్తారు.