కొత్త ఫోటో రిలీజ్ చేసిన నాసా
NEWS Aug 26,2024 09:17 am
కనువిందు చేస్తున్న చందమామ కొత్త ఫోటోను నాసా రిలీజ్ చేసింది. పసిఫిక్ తీరంలో.. తెల్లటి మబ్బులు.. నీలి రంగు ఆకాశం మధ్య.. ఆ నెలరేడు అద్భుతంగా దర్శనం ఇస్తున్న ఫోటోను నాసా తన సోషల్ మీడియా అకౌంట్‌లో అప్‌లోడ్ చేసింది. అంతర్జాతీయ స్పేస్ స్టేషన్‌లో ఉన్న మాథ్యూ డామ్నిక్ వ్యోమగామి ఆ ఫోటో తీశాడు. అంతరిక్ష అద్భుతాలను ఎప్పటికప్పుడు రిలీజ్ చేసే నాసా ఇప్పుడు తన కొత్త ఫోటోతో అందర్నీ అట్రాక్ట్ చేస్తోంది.