సింగర్ చిన్మయి సంచలన వ్యాఖ్యలు
NEWS Aug 26,2024 07:36 am
సింగర్ చిన్మయి శ్రీపాద తాజాగా హేమ కమిటీ నివేదికపై స్పందించారు. పరిశ్రమలో లైంగిక వేధింపులపై నియమించిన ఈ కమిటీ ఇటీవల కేరళ ప్రభుత్వానికి నివేదిక అందించింది. దీనిపై చిన్మయి స్పందిస్తూ లిరిక్ రైటర్ వైరముత్తు నుంచి తాను స్వయంగా లైంగిక వేధింపులు ఎదుర్కొన్నానని, ఆ కేసులో తాను పోరాడుతూనే ఉన్నానని తెలిపారు. సినీ ఇండస్ట్రీల్లో నేరస్తులు కలిసి పనిచేస్తారని, నేరస్తులకు శిక్ష పడకుండా అడ్డుకుంటున్నారని అన్నారు.