సామర్లకోట పంచరామ భీమేశ్వర స్వామి క్షేత్రంలో సోమవారం ఆలయ ఈవో బల్ల నీలకంఠం ఆధ్వర్యంలో శ్రావణ ప్రత్యేక పూజ మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు వెంకన్న శర్మ, రాంబాబు శర్మ, సత్యనారాయణమూర్తి వినయ్ శర్మ, బాల త్రిపుర సుందరి సమేత భీమేశ్వర స్వామికి పంచామృత అభిషేకాలు, బిళ్ళమపత్ర ప్రత్యేక పూజలు, సహస్ర కుంకుమ పూజలు, పత్ర పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు.