ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు
NEWS Aug 26,2024 09:00 am
అయినవిల్లి మండలంలోని వీరవల్లి పాలెం గ్రామంలో యాదవులు కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం అర్చకులు సురేష్ ఆధ్వర్యంలో కృష్ణుడికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. ఈ కార్యక్రమంలో మహిళలు పాల్గొన్నారు. దర్శనానంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. సాయంత్రం ఉట్టు ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.