సంజయ్ రాయ్‌పై లై డిటెక్టర్ టెస్ట్
NEWS Aug 26,2024 06:27 am
కోల్‌కతాలోని వైద్యురాలిపై అత్యాచారం, హత్య కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్‌పై లై డిటెక్టర్ టెస్ట్ జరిగింది. తాను సెమినార్ హాల్‌కి చేరుకునే సరికే బాధితురాలు చనిపోయిందని పేర్కొన్నట్లు తెలుస్తోంది. లై డిటెక్టర్ పరీక్షలో అనేక తప్పుడు, నమ్మశక్యం కాని సమాధానాలు వెల్లడైనట్లు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ TOI ఓ కథనం ప్రచురించింది. తాను చూసేసరికి అప్పటికే బాధితురాలు మృతి చెందిందని, భయంతో అక్కడి నుంచి పారిపోయినట్లు లై డిటెక్టర్ పరీక్ష సయమంలో సంజయ్ రాయ్ తెలిపాడు.