రావులపాలెం మండలం ఊబలంక గ్రామంలో అన్నా మినిస్ట్రీ స్వచ్ఛంద సేవా సంస్థ ప్రధాన కార్యాలయం వద్ద భారతరత్న మదర్ థెరీసా 114 వ జయంతి వేడుకలు సామాజిక వేత్త ఐఈ కుమార్ ఘనంగా నిర్వహించారు. మదర్ థెరీసా సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమం లో డా. ప్రశాంత్, యలమర్తి సూరిబాబు, అడ్మినిస్ట్రేషన్ అధికారి నేకూరి రాజేష్ కుమార్ పాల్గొని ఘనంగా నివాళులు అర్పించారు.