కాట కోటేశ్వరంలో అక్రమ మద్యం స్వాధీనం
NEWS Aug 26,2024 09:04 am
నిడదవోలు మండలం కాటకోటేశ్వరం గ్రామంలో అక్రమ మద్యం కలిగి ఉన్న ఒకరిని అరెస్టు చేశామని సమిశ్ర గూడెం ఎస్సై రమేష్ తెలిపారు. కాటకోటేశ్వరానికి చెందిన సూర్యనారాయణ 29 సీసాల మద్యం అక్రమంగా కలిగి ఉండటంతో దాన్ని స్వాధీనం చేసుకుని, అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. అక్రమంగా మద్యం విక్రయించే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామన్నారు.