రాజవొమ్మంగిలో వరద ఉద్ధృతికి కొట్టుకుపోయిన బిటి రోడ్డు
NEWS Aug 26,2024 05:19 am
రాజవొమ్మంగి మండలంలో శనివారం కురిసిన భారీ వర్షానికి చెరుకుంపాలెం గ్రామంలో బిటి రహదారి పూర్తిగా ఛిద్రమై, వరద ఉద్ధృతికి కొట్టుకుపోయింది. జాతీయ రహదారి నిర్మాణంలో ఉండడంతో హైవే నిర్మాణానికి ఉపయోగించే భారీ వాహనాలు రోడ్డుపై రాకపోకలు సాగించడంతో రోడ్డు పూర్తిగా ఛిద్రమైందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.