అంజోడా సిల్క్ ఫారంను ఎస్పీ సందర్శన
NEWS Aug 26,2024 09:10 am
డుంబ్రిగుడ మండలంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం అంజోడా సిల్క్ ఫారంను ఎస్పీ అమిత్బర్దర్ కుటుంబసభ్యులతో సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడిపారు. అనంతరం ఆయన తమ పిల్లలతో కలిసి మొక్కను నాటారు. అటవీశాఖ ఆధ్వర్యంలో దీనిని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తుండటం తెలిసిందే.