ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత అంశంపై నాగార్జున మళ్లీ స్పందించారు. తాము ఎలాంటి భూ ఆక్రమణలకు పాల్పడలేదని, అన్ని డాక్యుమెంట్లు ఉన్న భూమి అన్నారు. తుమ్మిడికుంట చెరువులో ఎలాంటి భూ ఆక్రమణలు జరగలేదని ఏపీ భూ సేకరణ చట్టం స్పెషల్ కోర్టు 2014 ఫిబ్రవరి 24న తీర్పు (ఎస్సార్.3943/2011) వెలువరించింది. ఇప్పుడు హైకోర్టులో కూడా ప్రాథమిక వాదనలు వినిపించాం. భూ చట్టానికి, తీర్పుకు కట్టుబడి ఉంటానన్నారు.