నాగార్జునకు నారాయణ ఛాలెంజ్
NEWS Aug 25,2024 03:17 pm
అక్కినేని నాగార్జునకు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. తుమ్మిడికుంట చెరువును కబ్జా చేయలేదని.. ఎన్ కన్వెన్షన్ దగ్గరకు వచ్చి చెప్పగలరా అని సవాల్ చేశారు. చెరువును కబ్జా చేసి, దొంగ పట్టాలు సృష్టించిన హీరో నాగార్జున.. సినిమా డైలాగులు కొడతానంటే నడవదని విమర్శించారు. ఈ పదేళ్ల పాటు ఎన్‌కన్వెన్షన్ ద్వారా సంపాదించిన డబ్బులన్నీ ప్రభుత్వానికి తిరిగి కట్టేయాలన్నారు.