తూర్పు గోదావరి జిల్లా గోకవరం పోలీస్ స్టేషన్ ను కోరుకొండ సీఐ సత్య కిషోర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు రోజుల క్రితం దొరికిన గంజాయి ముద్దాయిల కోసం గాలిస్తున్నామని, త్వరలోనే వారిపై కేసు నమోదుచేసి కోర్టుకు తరలిస్తామని చెప్పారు. స్థానిక రౌడీ షీటర్ లతో సమావేశమై వారి విధానాలను తెలుసుకున్నామని, సత్ప్రవర్తన కలిగిన రౌడీ షీటర్ లపై కేసులు తొలగిస్తున్నామని తెలిపారు.