1,041 సహాయక సంఘాలకు రుణాలు
NEWS Aug 25,2024 02:05 pm
కాకినాడ జిల్లాలో 1041 స్వయం సహాయక సంఘాలకు లఖ్ పతి దీదీలకు రూ.109.55 కోట్ల బ్యాంకు రుణాల పంపిణీ చేయడం జరిగిందని జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా తెలిపారు. కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద నిర్వహించిన లఖ్ పతి దీదీ పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని లబ్ధిదారులైన మహిళలకు ప్రభుత్వం మంజూరు చేసిన రుణాల చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.