ప్రస్తుత సమాజంలో ఉన్న పిల్లలకు హిందూ ధర్మం గొప్పతనాన్ని, దైవారాధనను, సాంప్రదాయాలను తెలియజేయాల్సిన అవసరం ఉందని విశ్వహిందూ పరిషత్ నాయకులు పేర్కొన్నారు. సోమవారం కృష్ణాష్టమిని పురస్కరించుకుని సామర్లకోట మండలం హుస్సేన్ పురం గ్రామంలో ఆదివారం శ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి ఆలయంలో, సీతారామ ఆలయంలో మహిళా భక్తులచే సామూహిక సరస్వతి దేవి, నటరాజ పూజలను నిర్వహించారు.