రాజమండ్రిలో ‘రేపు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ రద్దు’
NEWS Aug 25,2024 02:07 pm
రాజమహేంద్రవరం కలెక్టరేట్ వద్ద ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమాన్ని రేపు కృష్ణాష్టమి సందర్భంగా సెలవు దినం కావడంతో కార్యక్రమాన్ని నిర్వహించడం లేదని కలెక్టర్ ప్రశాంతి తెలిపారు. ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. సంబంధిత అధికారులు, జిల్లా ప్రజలందరూ గమనించాలని కోరారు. వచ్చే సోమవారం కార్యక్రమం యధావిధిగా కొనసాగుతుందన్నారు.