గుండెపోటుతో ఉపాధ్యాయుడు మృతి
NEWS Aug 27,2024 09:16 am
రాజమండ్రి రూరల్ పరిధిలోని బొమ్మూరు జీపీఆర్ హైస్కూల్ సోషల్ ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్న ప్రేమ్ కుమార్ 60 ఆదివారం గుండెపోటుతో స్థానిక హాస్పిటల్‌లో మృతి చెందారు. ఆయన మృతితో జీపీఆర్ హైస్కూల్లో విషాద ఛాయలు అలముకున్నాయి. మంచి ఉపాధ్యాయుడుగా,సౌమ్యుడిగా, విద్యార్థులందరికీ ఇష్టమైన గురువుగా గుర్తింపు పొందిన ఆయన మృతి చెందడాన్ని ఉపాధ్యాయులు, విద్యార్థులు జీర్ణించుకోలేక పోతున్నామని తెలిపారు.