కాకినాడలో ఆదివారం 33 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగి వేసవికాలాన్ని తలపిస్తుండడంతో పట్టణవాసులు వేడికి అల్లాడిపోతున్నారు. నిన్నటి వరకూ వర్షం, చిరు జల్లులతో సేద తీరిన నగర వాసులు ఆదివారం ఎండ తీవ్రతకు అల్లాడిపోతున్నారు. దీంతో కాకినాడలోని ప్రధాన కూడళ్లు నిర్మానుష్యంగా మారాయి. ఎండ వేడిమికి తట్టుకోలేక ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు.