బూర్జ, కొల్లివలస గ్రామాలకు సంబంధించి రైతు సేవ కేంద్రాలకు 20 టన్నుల యూరియాను వ్యవసాయ శాఖ అధికారులు సమకూర్చారు. ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవి కుమార్‌కు ఇటీవల రైతులు నుండి వినతుల దృష్ట్యా ఎరువుల కొరత లేకుండా తగిన సమయంలో ఎరువులను అందించాలనే ఉద్దేశించి రైతులకు అందిస్తామన్నారు. ఎరువులు కావలసిన రైతులు రైతు సేవా కేంద్రాలలో తమ ఆధార్ కార్డు, ఫోన్ నంబర్ వివరాలతో వ్యవసాయ సహాయకులను సంప్రదించాలని తెలిపారు.