సమగ్ర కుల గణన వెంటనే చేపట్టాలి
NEWS Aug 26,2024 09:11 am
KMR: సమగ్ర కుల గణన చేసి రిజర్వేషన్ లు 42% పెంచాలని బీసీ విద్యార్ధి సంఘం జిల్లా అధ్యక్షులు నీల నాగరాజు డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో ఆయన మాట్లాడుతూ రాష్టంలో కుల గణన చేస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టు కోవాలని కోరారు. బీసీ డిక్లరేషన్ వెంటనే అమలు చేయాలనీ కాంగ్రెస్ మేనిఫెస్టోలో పొందు పరిచిన బీసీ జన గణన విషయంమై ఇప్పటి వరకు ప్రభుత్వం నుండి స్పందన లేదన్నారు