ప్రధాని నరేంద్ర మోదీ రేడియోలో మన్ కీ బాత్ ప్రసంగం వినిపించారు. ఆగస్టు 29న తెలుగు భాష దినోత్సవం జరుపుకుంటారని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారికి తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని చెప్పారు. ఇక, అంతరిక్ష రంగంలో భారత్ దూసుకెళుతోందని అన్నారు. చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగిన తొలి దేశంగా భారత్ చరిత్ర సృష్టించిందని వెల్లడించారు.