కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం సుంకర రేవు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. గాడి మొగ గ్రామానికి చెందిన మల్లాడి గంగాధర్ తాళ్లరేవు నుంచి యానాం వైపు వస్తుండగా కాకినాడ వెళ్తున్న ఆర్టీసీ బస్ ఢీ కొనడంతో తలకు బలమైన గాయం అవడంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. కోరంగి ఎస్సై సత్యనారాయణ కేసు నమోదు చేసి మృతి చెందిన వ్యక్తిని కాకినాడ పోస్ట్ మార్టం కి తరలించారు.