ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు నెలలైనా కాకముందే హామీల అమలులో ముందడుగు వేస్తున్నామని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు. ఈనెల 23న కొత్తపేట మండలంలో జరిగిన వానపల్లి గ్రామ సభలో భాగంగా ముఖ్యమంత్రి హామీ ఇచ్చి, 24 గంటలు గడవక ముందే లబ్ధిదారులకు ప్రభుత్వం అందజేసిన ఎలక్ట్రికల్ స్కూటర్లను లబ్ధిదారుల కోరిక మేరకు ఆయన ఆదివారం ప్రారంభించారు.