రాజమండ్రికి చెందిన గణపతినీడి జగదీశ్, స్వప్న దంపతులు శ్రీ విఘ్నేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి అన్నపూర్ణ భవన నిర్మాణానికి రూ.లక్ష విరాళం అందజేశారు. వీరికి ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం అందజేసి, శేషవస్త్రంతో సత్కరించారు. అనంతరం శ్రీ స్వామి వారి చిత్రపటాన్ని అందజేశారు.