పోలీస్ ఎక్కడ పనిచేస్తున్నా ప్రజలకు జవాబుదారీ తనంగా పనిచేయాలని, రాజకీయ ఒత్తిడులకు భయపడకుండా పనిచేయటమే పోలీస్ శాఖ పని అని కాకినాడ డీఎస్పీ రఘువీర్ విష్ణు తెలిపారు. తన కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. కాకినాడ డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించానని చెప్పారు. గతంలో చిత్తూరు డీఎస్పీగా, విజయనగరం ఏసీబీ డీఎస్పీగా పనిచేశానని తెలిపారు.