రాజమహేంద్రవరం జీఎస్ఎల్ ఆసుపత్రి సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదాన్ని చూసి ఎంపీ దగ్గుపాటి పురందరేశ్వరి చలించిపోయారు. ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరితో కలిసి అటుగా వెళ్తున్న ఎంపీ బాధితురాలితో మాట్లాడారు. బాధితురాలిని జీఎస్ఎల్ ఆసుపత్రిలో చేర్పించి ఆమెకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. అనంతరం ఆస్పత్రి యాజమాన్యంతో ఫోన్‌లో మాట్లాడారు.