బీసీ రిజర్వేషన్ పితామహుడు మండల్‌కు నివాళి
NEWS Aug 25,2024 08:40 am
మలికిపురం పూలే, అంబేడ్కర్ భవనంలో బీసీ రిజర్వేషన్ పితామహుడు, దివంగత నేత బిందేశ్వర్ ప్రసాద్ మండల్ జయంతిని ఆదివారం నిర్వహించారు. మండల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. బీసీ రిజర్వేషన్ల కోసం ఆయన చేసిన కృషిని కొనియాడారు. కార్యక్రమంలో గుబ్బల బాబ్జి, గెడ్డం తులసి భాస్కరరావు, కోళ్ల వేణు, నల్లి శివకుమార్ పాల్గొన్నారు.