ప్రజల ఆరోగ్య సంరక్షణకే వైద్య శిబిరాలు
NEWS Aug 25,2024 08:26 am
గ్రామీణ ప్రాంతాల ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసమే ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని తమిళనాడులోని వేలూరుకు చెందిన స్కడ్డర్ ఆస్పత్రి వైద్యులు సలోమాన్ అన్నారు. అంబాజీపేట స్త్రీల ఆసుపత్రి వద్ద ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. 54 మందికి సాధారణ 21 మందికి దంత వైద్య సేవలు అందించారు. రూ.5,200 విలువైన మందులను ఉచితంగా అందజేశారు. స్థానిక ఆసుపత్రి వైద్యులు సేవలందించారు.