దేవగుప్తం హైస్కూల్లో స్టాఫ్ రూమ్‌గా మారిన అటల్ టింకరింగ్ ల్యాబ్
NEWS Aug 25,2024 08:42 am
విద్యార్థుల్లో సృజనాత్మకను వెలికి తీసి సరికొత్త ఆవిష్కరణలను సృష్టించేందుకు అల్లవరం మండలం దేవగుప్తం ఉన్నత పాఠశాలల్లో ఏర్పాటు చేసిన అటల్ టింకరింగ్ ల్యాబ్ విశ్రాంతి రూమ్ మార్చేశారు. గత ప్రభుత్వ హయాంలో దేవగుప్తం ఉన్నత పాఠశాలలకు అటల్ టింకరింగ్ ల్యాబ్ ఏర్పాటు చేశారు. అటల్ టింకరింగ్ ల్యాబ్ ద్వారా విద్యార్థులు సైన్సు ప్రయోగాలు ఆవిష్కరించి, విద్య, వైజ్ఞానిక సదస్సుల్లో ప్రదర్శనలో ఇవ్వాల్సి ఉంది.