శంకవరం మండలం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి ఆలయంలో శనివారం భక్తులు నిర్వహించిన వివిధ సేవలు ద్వారా రూ.46,33,696 ఆదాయం లభించిందని ఆలయ అధికారులు తెలిపారు. ఉదయం నుంచి అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని పూజలు, వ్రతాలు నిర్వహించారు. అనంతరం స్వామివారి అన్నప్రసాద స్వీకరించారని తెలిపారు.