అల్లూరి జిల్లా రాజవొమ్మంగి మండలంలోని అప్పలరాజుపేట అటవీ ప్రాంతంలో గల వట్టిగెడ్డ జలాశయం పూర్తిగా నిండి జలకళను సంతరించుకుంది. శనివారం కురిసిన వానకు ఈ జలాశయం పూర్తిగా నిండిపోయింది. వరద నీరు పొర్లి గట్టు పైనుంచి దిగువకు ప్రవహిస్తోంది. ఎటు చూసినా నీరు, చుట్టూ కొండలు, పచ్చని అడవితో ఆ ప్రాంతం ఆహ్లాదకరంగా మారి పర్యాటకులను ఆకర్షిస్తోంది.