అమ్మవారి దర్శనాలు నిలిపివేత
NEWS Aug 25,2024 08:30 am
దేవీపట్నం మండలంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గండి పోచమ్మ తల్లి ఆలయం వద్ద అమ్మవారి దర్శనాలు నిలిపివేసినట్లు దేవస్థాన ఈవో లక్ష్మీ కుమార్ తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. గోదావరి వరద ఉద్ధృతంగా ఉందని, అమ్మవారి ఆలయం చుట్టుపక్కల నీరు ఎక్కువగా ఉందని తెలిపారు. ఈ కారణంగా దర్శనాలు నిలిపివేశామని, భక్తులెవరూ దర్శనం కోసం రావొద్దని చెప్పారు.