పెద్దాపురం నియోజకవర్గాన్ని రాష్ట్రానికే ఒక మోడల్ నియోజకవర్గంలా అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక చేపట్టినట్లు ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. ఆదివారం సామర్లకోట రింగ్ రోడ్ సెంటర్, గడియారం స్తంభం, నీలమ్మ చెరువు ఆధునీకరణ పనులను కమిషనర్ శ్రీవిద్యతో కలిసి ఆయన పరిశీలించారు. రోడ్ల పరిస్థితిపై సీఎం చంద్రబాబు స్పందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. అడబాల కుమారస్వామి, బడుగు శ్రీకాంత్ పాల్గొన్నారు.