అల్లూరి జిల్లాలో ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన బొర్రా గుహలు కొత్త రూపు సంతరించుకోనున్నాయి. ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ప్రదేశాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దనున్నారు. సందర్శకులకు మరపురాని జ్ఞాపకాలు మిగిల్చేలా ఆధునికీకరించనున్నారు. లోపల మిరమిట్లు గొలిపే విద్యుత్తు కాంతులు, పూర్తిస్థాయి మౌలిక వసతులకు ప్రణాళిక చేస్తున్నారు.