ముంచంగిపుట్టు మండలంలోని బూసిపుట్టులో తాగునీటి సౌకర్యం లేక గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత్యంతరం లేక పంట పొలాల వద్ద వచ్చే నాచుపట్టిన ఊట నీటిని వినియోగించుకుని పలు రోగాల బారిన పడుతున్నారు. పలుమార్లు అధికారులకు తెలిపిన పట్టించుకోవడంలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తాగునీరు సౌకర్యం కల్పించాలని కోరారు.