జీకే వీధి మండలం దారకొండ పంచాయితీ చెక్కలమద్ది గ్రామంలో ఎంపీపీ పాఠశాల భవనం పూర్తిగా శిధిలావస్థకు చేరుకుంది. దీంతో విద్యార్థులు విద్యను అభ్యసించడానికి నానా ఇబ్బందులు పడుతున్నారు. భవనం శిథిలావస్థకు చేరుకొని మరమ్మతులకు గురి కావడంతో ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నూతన పాఠశాల భవనం నిర్మించాలని కోరుతున్నారు.